తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఇవిగో!

  • ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తి
  • తాజాగా ఫలితాల వెల్లడి
  • నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర వరప్రసాద్
  • ఉపాధ్యక్షురాలిగా సుప్రియా అశోక్ ఏకగ్రీవం
  • ఈసీ మెంబర్ గా గెలిచిన దిల్ రాజు
తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయ్యాయి. దిల్ రాజు మద్దతు పలికిన ప్యానెల్ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. దిల్ రాజు ఈసీ మెంబర్ గా నెగ్గారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దామోదర వరప్రసాద్ ఎన్నికయ్యారు. ఆయనకు 339 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి జెమినీ కిరణ్ కు 315 ఓట్లు వచ్చాయి. 

కౌన్సిల్ ఉపాధ్యక్షురాలిగా సుప్రియా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శులుగా వైవీఎస్ చౌదరి, ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా నట్టికుమార్, భరత్ చౌదరి ఎన్నికయ్యారు.

ఈసీ మెంబర్లుగా గెలిచింది వీరే...

దిల్ రాజు
డీవీవీ దానయ్య
యలమంచిలి రవి
శ్రీనివాస్
సురేందర్ రెడ్డి
కిశోర్
పద్మిని
వేణుగోపాల్
గోపీనాథ్ ఆచంట
కేశవరావు
మధుసూదన్ రెడ్డి
రామకృష్ణ గౌడ్
తోట కృష్ణ
అభిషేక్ అగర్వాల్ 


Telugu Film Producers Council
Elections
Results
Tollywood

More Telugu News